Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఇవాళనే భవన యజమాని సతీశ్ బచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫర్నిచర్ దుకాణ యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
Details
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రజలకు సూచించారు.