Loading...
Andhra Pradesh : ఏపీకి భారీ పెట్టుబడుల జాక్‌పాట్.. రూ.71,602 కోట్ల ప్రాజెక్టులు, 14,250 మందికి ఉద్యోగాలు!
పీకి భారీ పెట్టుబడుల జాక్‌పాట్.. రూ.71,602 కోట్ల ప్రాజెక్టులు, 14,250 మందికి ఉద్యోగాలు!

Andhra Pradesh : ఏపీకి భారీ పెట్టుబడుల జాక్‌పాట్.. రూ.71,602 కోట్ల ప్రాజెక్టులు, 14,250 మందికి ఉద్యోగాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికి వేగం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో వరుసగా ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లతో విశాఖ ఐటీ హబ్‌గా ఎదుగుతుండగా, తాజాగా మరో మెగా డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కీలక ప్రతిపాదన ముందుకు వచ్చింది.

వివరాలు

రూ.71,602 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీసీ పరిశీలన

రాష్ట్రంలో డేటా సెంటర్లు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్‌గాట్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వంటి పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPC) పరిశీలించింది.

మొత్తం రూ.71,602.60 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి.

ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.

వివరాలు

విశాఖలో రూ.58,743 కోట్లతో మరో మెగా డేటా సెంటర్

ఎస్ఐపీసీ సమావేశంలో చర్చించిన ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైనది విశాఖపట్నంలో మరో భారీ డేటా సెంటర్ ఏర్పాటు.

డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ సంస్థ రూ.58,743 కోట్ల పెట్టుబడితో లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

ఈ ప్రాజెక్టును రాబోయే ఐదేళ్లలో ఐదు దశల్లో అమలు చేయాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.

ఈ డేటా సెంటర్ ద్వారా సుమారు 1,250 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

కర్నూలులో భారీ సోలార్ తయారీ ప్రాజెక్టు

కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ 12 గిగావాట్ల సోలార్ ఇన్‌గాట్, 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

ఈ ప్రాజెక్టుతో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఇందుకోసం ఎకరాకు రూ.10 లక్షల చొప్పున మొత్తం 156.96 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2,125 కోట్ల పెట్టుబడితో ఫాస్పారిక్ యాసిడ్‌తో పాటు అనుబంధ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ముందుకొచ్చింది.

ఈ పరిశ్రమ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకోసం 450 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ADVERTISEMENT

వివరాలు

నెల్లూరులో రెండు భారీ పరిశ్రమల ప్రతిపాదనలు

నెల్లూరు జిల్లా మనుబోలులో వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపింది.

అదే జిల్లాలో ప్రిసోల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.330.71 కోట్ల పెట్టుబడితో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసి 1,110 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

కడపలో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్

కడప జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC)లో ఏఐఎల్ డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది

వివరాలు

ప్రభుత్వానికి అదనపు విజ్ఞప్తులు

ఈ పారిశ్రామిక ప్రాజెక్టులతో పాటు కొన్ని సంస్థలు అదనపు ప్రోత్సాహకాలు కల్పించాలని, గతంలో మంజూరైన అనుమతుల్లో కొన్ని సవరణలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరాయి.

ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించి అమల్లోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT