Page Loader
యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్ 
యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్

యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Jul 02, 2023
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. యూనిఫాం సివిల్ కోడ్ రాజ్యాంగంలో ప్రస్తావించబడిందన్నారు. అయితే దాని అమలు తీరులోనే తనకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. యూసీసీ అమలుకు సంబంధించిన అన్ని కోణాలను బీజేపీ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాయావతి అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేసి దేశంలో యూసీసీని బలవంతంగా అమలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని మాయావతి వ్యక్తం చేశారు. అయితే ప్రతి విషయంలో అన్ని మతాల వారికి ఒకే చట్టం వర్తింపజేయాలని, అది దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న మాయావతి