
Mayawathi: మాయావతి కీలక నిర్ణయం.. మేనల్లుడి తొలగింపు.. ఆనంద్ కుమార్ కు కీలక బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ సమన్వయ కర్తగా ఉన్న తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాష్ ఆనంద్ ను ఆహ్వానించాం.
కానీ పార్టీ ఉద్యమ, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆకాష్ పూర్తి స్థాయిలో పరిపక్వత సాధించే వరకు ఆయన్ని బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు అని చెప్పారు.
బీజేపీ పై వివాదాస్పద కామెంట్లు చేసినందుకు ఆకాష్ పై కేసు నమోదైంది.
Details
ఆకాష్ పరిపక్వత సాధించే వరకు బాధ్యతల నుండి తొలగింపు
ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని బుల్డోజర్ ప్రభుత్వంగా పేర్కొన్నారు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఎలెక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నోటీసులు ఇచ్చారు.
ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలిలను బీఎస్పీ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఆయన్ని బాధ్యతల నుండి తొలగించింది.
కాగా సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపుగా కాన్షిరాం, నేను జీవితం మొత్తాన్ని అంకితం చేశామని మాయావతి చెప్పుకొచ్చారు.
కొత్త తరాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. తన రాజకీయ వారసుడిగా ఆకాష్ పరిపక్వత సాధించే వరకు బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని అన్నారు.