Page Loader
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు 
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు 

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. డ్యామేజ్ అయిన పిల్లర్లను ముఖ్యమంత్రి రేవంత్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్యారేజీకి మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి. ఇందులో డీ బ్లాక్‌లోని 7 పిల్లర్లు కుంగిపోయాయి. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులకు ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీ గురించి వివంచారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన అనంతరం తర్వాత ఇరిగేషన్ అధికారులతో రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత బ్యారేజ్‌ గురించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేడిగడ్డ పిల్లర్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్