Loading...
Raul John Aju: పుతిన్‌తో సెల్ఫీ దిగిన 16 ఏళ్ల భారత కుర్రాడు.. ఎవరీ రౌల్‌ జాన్‌ అజు?
పుతిన్‌తో సెల్ఫీ దిగిన 17 ఏళ్ల భారత కుర్రాడు.. ఎవరీ రౌల్‌ జాన్‌ అజు?

Raul John Aju: పుతిన్‌తో సెల్ఫీ దిగిన 16 ఏళ్ల భారత కుర్రాడు.. ఎవరీ రౌల్‌ జాన్‌ అజు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడం,ఆయనతో కలిసి ఫొటో దిగడం అంత సులభమైన విషయం కాదు. కానీ కేరళకు చెందిన 16ఏళ్ల రౌల్‌ జాన్‌ అజుకు మాత్రం ఆ అవకాశం దక్కింది. 'భారత ఏఐ కిడ్‌'గా గుర్తింపు పొందిన ఈ యువకుడు పుతిన్‌తో సెల్ఫీ తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఓ అంతర్జాతీయ సదస్సులో రష్యా అధ్యక్షుడిని కలిసిన అజు..ఆయనతో దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు. మాస్కోలో గురువారం'ఏఐ జర్నీ 2026'పేరుతో అంతర్జాతీయ కృత్రిమ మేధస్సు సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భారత్‌,చైనా,సెర్బియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)సహా పలు దేశాల నుంచి ఏఐ రంగానికి చెందిన నిపుణులు హాజరయ్యారు.

వివరాలు 

పుతిన్‌తో సెల్ఫీ.. జీవితంలో మరిచిపోలేని క్షణం!

సదస్సులోని ప్లీనరీ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రౌల్‌ జాన్‌ అజు ఆయనను నేరుగా కలుసుకుని సెల్ఫీ దిగాడు.

ఈ ఫొటో,వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అజు తన అనుభవాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

''తొమ్మిదేళ్ల వయసులో బాత్‌రూమ్‌లో నా మొదటి వీడియో రూపొందించినప్పటి నుంచి.. 17 ఏళ్లకే పుతిన్‌తో సెల్ఫీ దిగే స్థాయికి చేరుకునే వరకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఈ జీవితం ఇచ్చింది. ఇంతటి స్థాయికి వస్తానని కలలో కూడా అనుకోలేదు. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది'' అని పేర్కొన్నాడు.

వివరాలు 

తొమ్మిదేళ్లకే ఏఐపై ఆసక్తి.. 

ఈ పోస్ట్‌ కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. దీనిపై రష్యా ఎంబసీ కూడా స్పందించింది. పుతిన్‌ను కలిసిన అతి తక్కువ వయసున్న వ్యక్తుల్లో రౌల్‌ అజు ఒకడని వెల్లడించింది.

కేరళలోని కొచ్చికి చెందిన రౌల్‌ జాన్‌ అజు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడు.

కామర్స్‌ విభాగంలో విద్యను అభ్యసిస్తూనే మరోవైపు సాంకేతిక రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు.

కేవలం తొమ్మిదేళ్ల వయసు నుంచే కృత్రిమ మేధస్సుకు సంబంధించిన విషయాలను నేర్చుకోవడం ప్రారంభించాడు.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే తన తండ్రి నుంచి కూడా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవగాహన పొందాడు. ముఖ్యంగా ఏఐ టూల్స్‌ వినియోగంపై పట్టు సాధించాడు.

ADVERTISEMENT

వివరాలు 

ఐదు లక్షల మందికి ఏఐ శిక్షణ!

ఈ ఆసక్తితోనే తన పాఠశాల ప్రాజెక్టులో భాగంగా 12 ఏళ్ల వయసులో 'మిబాట్‌' పేరుతో ఓ రోబోట్‌ను రూపొందించాడు.

అక్కడితో ఆగకుండా ఇప్పటివరకు మొత్తం 15 ఏఐ ఆధారిత టూల్స్‌ను అభివృద్ధి చేశాడు.

తన ఆలోచనలకు వ్యాపార రూపం ఇవ్వాలనే ఉద్దేశంతో 'ఏఐ రియల్మ్‌ టెక్నాలజీస్‌' పేరుతో సొంతంగా స్టార్టప్‌ను కూడా ప్రారంభించాడు.

ప్రస్తుతం ఈ సంస్థలో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ అందిస్తున్నారు.

అంతేకాకుండా 'థింక్‌క్రాఫ్ట్‌ అకాడమీ' పేరుతో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఐఐటీలు, ఐఐఎంలతో పాటు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఏఐ సంబంధిత నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

తండ్రికే ఉద్యోగం ఇచ్చిన తనయుడు!

సాధారణంగా 17 ఏళ్ల వయసులో ఉన్న విద్యార్థులు తమ అవసరాల కోసం తల్లిదండ్రులను పాకెట్‌ మనీ అడుగుతుంటారు.

కానీ రౌల్‌ జాన్‌ అజు విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అతడు స్థాపించిన కంపెనీలోనే ప్రస్తుతం తన తండ్రి ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

ఇందుకు ప్రతిఫలంగా నెలకు రూ.2 లక్షల జీతం అందుకుంటున్నారు.

చిన్న వయసులోనే సొంత సంస్థను స్థాపించి, వందలాది మందికి కాకుండా లక్షలాది మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ అందిస్తున్న అజు ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT