LOADING...
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!
ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!

Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నిరీక్షిస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ-2025 (Mega DSC 2025) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం తన అధికారిక 'ఎక్స్‌' ఖాతా ద్వారా ప్రకటించారు.

Details

వెబ్ సైట్ లో షెడ్యూల్ వివరాలు 

పరీక్షల షెడ్యూల్‌తో పాటు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను అందించారు. పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు (GOs), విభాగాల వారీగా పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల సమాచారం ఆదివారం ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.