తదుపరి వార్తా కథనం

Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి
వ్రాసిన వారు
Stalin
Jan 17, 2024
05:42 pm
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. యూపీఎస్‌సీ మాదిరిగానే గ్రూప్స్ పరీక్షలని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమ పథకాల జారీ విషయంలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు సంబంధించిన ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యూపీఎస్‌సీ మాదిరిగానే గ్రూప్స్ పరీక్షలు: కోమటిరెడ్డి
ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ pic.twitter.com/6ms5EAcl8U
— V6 News (@V6News) January 17, 2024