LOADING...
Hyderabad: శంషాబాద్‌ సమీపంలో మెగా టెర్మినల్‌.. 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు
శంషాబాద్‌ సమీపంలో మెగా టెర్మినల్‌.. 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు

Hyderabad: శంషాబాద్‌ సమీపంలో మెగా టెర్మినల్‌.. 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణానికి ఆర్టీసీ వడివడిగా అడుగులు వేస్తోంది. శంషాబాద్‌ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న బహదూర్‌గూడ గ్రామంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ భూమిని గుర్తించి కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆర్టీసీ లేఖ రాసింది. స్థల సేకరణ పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌స్టేట్‌ బస్‌ టెర్మినల్‌, ఎలక్ట్రిక్‌ బస్‌డిపో, ఛార్జింగ్‌ కేంద్రం, మల్టీ లెవల్‌ పార్కింగ్ వంటి అధునాతన మౌలిక వసతులతో ప్రాజెక్ట్‌ను రూపొందించింది.

వివరాలు

ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి నిర్ణయం

ఇదే సమయంలో నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) సమీపంలో 12 చోట్ల కొత్త బస్‌ టెర్మినళ్ల నిర్మాణానికి స్థల సేకరణ ప్రక్రియను కూడా ప్రారంభించింది. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సిటీ సర్వీసుల్లో కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులనే నడపాలని నిర్ణయించింది. జిల్లాల నుంచి వచ్చే డీజిల్‌ బస్సులను నగరంలోకి ప్రవేశించకుండా నియంత్రణలు విధించనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఓఆర్‌ఆర్‌ అవతలికే పరిమితం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. హైస్పీడ్‌ రైళ్ల కోసం శంషాబాద్‌లో భారీ టెర్మినల్‌ను నిర్మించనుండగా, దీనిని మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు.

వివరాలు

ఆర్టీసీ టెర్మినల్‌ కూడా ఏర్పాటు

అదే ప్రాంతంలో ఆర్టీసీ టెర్మినల్‌ కూడా ఏర్పాటు చేయబడుతుంది. బెంగళూరు రహదారి మీదుగా వచ్చే బస్సులు అక్కడికే పరిమితం అవుతాయి. అక్కడి నుంచి ప్రయాణికులు ఎలక్ట్రిక్‌ బస్సుల ద్వారా నగరంలోకి చేరాల్సి ఉంటుంది. జిల్లా, సిటీ బస్సుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్‌ బస్‌ డిపోతో పాటు 33 కేవీ సామర్థ్యంతో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

వివరాలు

ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలు

విశాలమైన నిరీక్షణ గదులు, ఏసీ లాంజ్‌లు, ఉచిత వైఫై దివ్యాంగులకు ప్రత్యేక శౌచాలయాలు, రెస్ట్‌రూమ్‌లు క్లోక్‌రూమ్‌, లగేజ్‌ స్టోరేజ్‌ సౌకర్యం మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక జోన్లు, బేబీ కేర్‌ గదులు బస్సులు వచ్చి, వెళ్లే సమయాల సమాచారానికి యాప్‌ ఇంటిగ్రేషన్

Advertisement