
Mehul Choksi extradition: మెహుల్ ఛోక్సీని వీలైనంత త్వరగా దేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నాలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక నేరంలో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఏ అవకాశం ఉన్నా వదలకూడదని భారత ప్రభుత్వం తేల్చిచెప్పినట్టు సమాచారం.
ఈ దిశగా చట్టపరంగా లభించే అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ వర్గాలపై ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
మరో వైపు, ఛోక్సీ తరఫు న్యాయవాదులు అతడిని భారత్‌కు తీసుకురాకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
దీంతో భారత ప్రభుత్వం కోర్టుల్లో న్యాయపరంగా సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
అప్పగింత ప్రక్రియ ప్రారంభమైందా?
అంతేకాకుండా,ఛోక్సీకి రక్త క్యాన్సర్ (బ్లడ్ కాన్సర్) ఉన్న కారణంగా బెయిల్‌కు కూడా తీవ్రంగా ప్రయత్నించవచ్చు. "మా క్లయింట్ పారిపోయే ప్రమాదం లేదు.. అతని ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం అతడు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నాడు," అని ఛోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు.
2022లో ఛోక్సీ కేసులో భారత్ ఇంటర్‌పోల్ ద్వారా జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పట్లో ఛోక్సీ న్యాయవాదులు ఇంటర్‌పోల్ కమిషన్ అయిన సీసీఎఫ్‌ను ఆశ్రయించి, తమ క్లయింట్‌ను భారత్‌కు అప్పగిస్తే మానవహక్కులు ఉల్లంఘించబడతాయని వాదించారు.
అతడిని రాజకీయంగా వేధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల సీసీఎఫ్ రెడ్ కార్నర్ నోటీసును రద్దు చేసింది.
వివరాలు
ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించిన భారత్
ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషించింది.
ఇప్పటికే ఛోక్సీపై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం 2018, 2022 సంవత్సరాల్లో రెండు ఓపెన్ ఎండెడ్ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది.
భారత అధికారులు ఈ వారెంట్లను బెల్జియంలోని స్థానిక అధికారులతో పంచుకున్నారు.
తాజాగా ఆ వారెంట్ ఆధారంగానే అతడిని బెల్జియంలో అరెస్ట్ చేశారు.
ఇది రెడ్ కార్నర్ నోటీస్ లేకపోయినా అతడి అరెస్టు సాధ్యమేనని భారత్ నిరూపించినట్టయింది.
వివరాలు
అప్పగింత ప్రక్రియకు బలమైన ఆరంభం
చోక్సీ అరెస్టుతో భారత్‌కు అప్పగింత ప్రక్రియ మరింత స్పష్టతకు వచ్చింది.
ప్రస్తుతం ఈ ప్రక్రియకు సంబంధించి అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు.
అయితే చివరికి అతడు భారత్‌కు ఎంత త్వరగా రాగలడనేది న్యాయస్థానాల్లో జరిగే విచారణలపై ఆధారపడి ఉంటుంది.