Page Loader
AP Assembly Budget sessions: స్పీకర్ పోడియం వద్ద టీడీపీ నిరసన..టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
స్పీకర్ పోడియం వద్ద టీడీపీ నిరసన..టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

AP Assembly Budget sessions: స్పీకర్ పోడియం వద్ద టీడీపీ నిరసన..టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం చెలరేగింది. వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం ప్రారంభమైంది. తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు సుధాకర్‌బాబు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన, ముఖ్యంగా స్పీకర్‌ను భౌతికంగా తాకేందుకు ప్రయత్నించడంపై సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Details

స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపిన టీడీపీ 

మరోవైపు తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్‌ తమ్మినేని సీతారాం పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.