Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ సూరత్ నగరంలో ఘోరం జరిగింది. పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా కారు వెళ్లింది. దీంతో రెండున్నరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.
రాయల్ టైటానియం బిల్డింగ్‌లోని బేస్‌మెంట్ పార్కింగ్‌లో జరిగిన ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ అమర్చిన కెమెరా ఫుటేజీని పరిశీలించారు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా వల్లే ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ పుటేజీ ద్వారా స్పష్టమవుతోంది.
మెర్సిడెస్ కారును డ్రైవర్ పార్కింగ్ స్థలం నుంచి బయటకు తీసేందుకు రివర్స్ చేస్తున్న క్రమంలో అక్కడే ఆడుకుంటున్న అమ్మాయిపై దూసుకెళ్లింది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది.
గుజరాత్
విషమంగా బాలిక పరిస్థితి
తీవ్రంగా గాయపడిన బాలికను తల్లి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అనంతరం తల్లి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. చిన్నారి అక్కడ ఆడుకుంటుందని తెలిసి కూడా డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా రివర్స్ తీశాడని బాలిక తల్లి పోలీసుల ఫిర్యాదులే పేర్కొంది.
దీని ఆధారంగా పోలీసులు మెర్సిడెస్ డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తీవ్ర గాయాలు కావడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిన్నారిపై దూసుకెళ్లిన కారు దృశ్యాలు
#WATCH A young girl is in critical condition after being struck by a car in the underground parking lot of an apartment complex in #Surat pic.twitter.com/t1ven8riOA
— The Blunt Times (TBT) (@BluntTbt) March 9, 2024