
MiG-21: ఇవాళ రిటైర్ అవుతున్న మిగ్-21 ఫైటర్.. దీనికి ''ఎగిరే శవపేటిక''గా పేరు. ఎందుకు వచ్చిందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
భారత వైమానిక దళం(IAF)లో 60 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 ఈ రోజు (Sep 26) రిటైర్ అవుతోంది. మొత్తం 60 సంవత్సరాల పాటు దేశానికి సేవచేసిన ఈ విమానం, 1963లో IAFలో చేరి, తరువాత 1965, 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధాలలో, 1999లోని కార్గిల్ యుద్ధంలో, 2019లో జరిగిన బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది.
వివరాలు
"ఎగిరే శవపేటిక" గా గుర్తింపు
అయితే, ఇటీవల ఈ విమానాలు తరుచుగా కూలిపోతుండటంతో, వీటిని రిప్లేస్ చేయాలని భారత సైన్యం భావించింది. గతంలో 400కంటే ఎక్కువ ప్రమాదాలు నమోదు అయ్యాయి, వాటిలో చాలాసార్లు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. దీని కారణంగా MiG-21కి దేశంలోనే "ఎగిరే శవపేటిక" అనే గుర్తింపు వచ్చింది. 1960లలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫైటర్ జెట్ కు అనేక అప్‌గ్రేడ్‌లు చేయబడ్డాయి. MiG-21ని సోవియట్ యూనియన్‌లోని మికోయన్-గురేవిచ్ డిజైన్ బ్యూరో రూపొందించింది, ఇది సుమారుగా 60 దేశాల్లో వినియోగంలోకి వచ్చింది.
వివరాలు
మిగ్-21 స్థానంలో LCA తేజస్ Mk1A
ప్రస్తుతానికి, MiG-21 స్థానంలో స్వదేశీంగా రూపొందించిన LCA తేజస్ Mk1Aను ప్రవేశపెట్టే విధంగా ప్రణాళిక రూపొందుతోంది. అయితే, పదే పదే డెలివరీ జాప్యాల వల్ల మిగ్-21 విమానాల జీవిత కాలం పొడగించుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు, భారత వైమానిక దళం 31 MiG-21 బైసన్‌లతో రెండు స్క్వాడ్రన్‌లను నిర్వహిస్తోంది. MiG-21ల విరమణ తర్వాత, భారత వైమానిక దళం పోరాట సామర్థ్యం 29 స్క్వాడ్రన్‌లకు తగ్గిపోతుంది. ఇది 1960ల తరువాత అత్యల్ప స్థాయిని సూచిస్తుంది. ఈ సంఖ్య 1965 యుద్ధ సమయంలో ఉన్న స్క్వాడ్రన్‌ల సంఖ్యకంటే తక్కువగా ఉంది. IAF కోసం అవసరమైన 42 స్క్వాడ్రన్‌ల కంటే కూడా ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంది.