Page Loader
Damodara Rajanarsimha:మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్ 
Damodara Rajanarsimha:మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్

Damodara Rajanarsimha:మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్ 

వ్రాసిన వారు Stalin
Jan 15, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

Minister Damodara Rajanarsimha: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ హ్యాకింగ్‌కు గురకావడం సంచలనంగా మారింది. కేటుగాళ్లు ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసిన తర్వాత.. బీజేపీ, టీడీపీతో పాటు తమిళనాడులోని రాజకీయ పార్టీలకు రకరకాల పోస్టులను వందల సంఖ్యలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన మంత్రి సోషల్ మీడియా టీమ్ వెంటనే అప్రమత్తమైంది. ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. మంత్రి ఫేస్‌బుక్ పేజీ హ్యాకింగ్‌కు గుర్తించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలకు సందేశం పంపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు