LOADING...
Komatireddy: దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణం..రూ.10,986 కోట్లు కేటాయింపు 
తొలి దశ హ్యామ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.10,986 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy: దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణం..రూ.10,986 కోట్లు కేటాయింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలసి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తొలి దశలో HAM రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ.10,986 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ తొలి దశలో టెండర్ ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

HAM రోడ్లు నిర్మాణం ద్వారా రవాణా సౌకర్యం పెరుగుతుంది 

అధిక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్ట్‌లో మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల HAM రోడ్లు నిర్మించనున్నట్టు, అలాగే జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు కోమటిరెడ్డి వివరించారు. ఈ HAM రోడ్లు నిర్మాణం ద్వారా రవాణా సౌకర్యం పెరుగుతుందని, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి విస్తృతంగా దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.