
Pawan-Lokesh: డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. రాజకీయ అంశాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
శాసనసభ సమావేశాల విరామ సమయంలో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కలిశారు. లోకేశ్ పవన్ కల్యాణ్‌ను ఈ నెల 25న జరగనున్న డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ రంగంలో జరిగిన పెద్ద స్థాయి నియామకాలను గుర్తిస్తూ,ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా,పలు రాజకీయ,విద్యా సంబంధిత అంశాలపై ఇద్దరి మధ్య చర్చ కూడా జరిగింది.
వివరాలు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది: లోకేశ్
వైసీపీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు దాదాపు 106 కేసులు వేశారని లోకేశ్ తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఏళ్ల తరబడి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కలలు ఈ నియామకాలతో సాకారం అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా లోకేశ్ చేసిన ట్వీట్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నను ఆయన ఛాంబర్ లో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవనన్న ఆహ్వానించాను. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు… pic.twitter.com/RTNaXaSwh8
— Lokesh Nara (@naralokesh) September 22, 2025