Nara Lokesh: తుఫాన్ ప్రభావిత నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉండాలి: లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
తుపాను దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 'మొంథా' తుపాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నందున, అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు. అవసరమైతే కూటమి పార్టీల కార్యకర్తలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
వివరాలు
అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు, ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశం
తీరప్రాంతాలు ,లంక గ్రామాల ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, తగిన ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ సిబ్బంది అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లు, అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యలు రాకుండా మొబైల్ ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేయాలని లోకేశ్ తెలిపారు. చెరువుల గట్లు దెబ్బతినే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మొంథా తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.. మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు..
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష చేసారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు… pic.twitter.com/3IV5p8dhOu
— Telugu Desam Party (@JaiTDP) October 27, 2025