Nara Lokesh: కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే ఏపీకి గుడ్‌న్యూస్ రాబోతోంది : మంత్రి లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
దావోస్ పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
కాగ్నిజెంట్ నుండి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ రాబోతుందని లోకేశ్ తెలిపారు.
విశాఖపట్నం,విజయవాడ,తిరుపతిలో 2.2మిలియన్ చదరపుఅడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.
కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ,ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్-2నగరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించాలని కోరారు.
ఏఐ,క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో హైస్కిల్ వర్క్‌ఫోర్స్‌ను తయారుచేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం ఏర్పరచాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న 80,000మంది ఉద్యోగులను టైర్-1నగరాల నుంచి టైర్-2 నగరాలకు తరలించే ప్రణాళికలు ప్రకటించామని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ చెప్పారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.