LOADING...
Narayana: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం.. . సీఎండీతో చర్చించిన మంత్రి నారాయణ
రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం

Narayana: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం.. . సీఎండీతో చర్చించిన మంత్రి నారాయణ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, జిందాల్ సా ఛైర్మన్ పృధ్వీరాజ్ జిందాల్‌లతో నారాయణ సమావేశమయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణ సమీకరణపై హడ్కో ఛైర్మన్‌తో చర్చలు జరిపారు. ఇప్పటికే హడ్కో రూ. 11,000 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అలాగే, రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు పై పృధ్వీరాజ్ జిందాల్‌తో కూడా నారాయణ చర్చించారు. గుంటూరు, విశాఖ ప్రాంతాల్లో ఇప్పటికే రెండు ప్లాంట్లకు జిందాల్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, అదనంగా మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి నారాయణ జిందాల్‌తో సమాలోచనలు నిర్వహించారు.