Page Loader
AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..

AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 ప్రధాన అంశాలపై చర్చించారు. కేబినెట్ కీలకంగా బార్ లైసెన్స్ ఫీజును రూ. 25 లక్షలకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే, యువజన, పర్యాటక శాఖలో జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు - 2025కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా, సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు మంజూరు చేసింది. ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ రూపకల్పన చేయనుంది.

వివరాలు 

మంత్రి కొలుసు పార్థసారథి వివరణ 

అంతేకాకుండా, రూ. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం, మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. ఆర్‌సెల్ మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఉత్పత్తి ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. త్రి-స్టార్ హోటళ్లలో గదుల సంఖ్య పెరగాలని, టూరిజం శాఖ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పై ప్రత్యేక చర్యలు 

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ అమలుకు "జలహారతి కార్పొరేషన్" పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఏడాది 1000 నుంచి 2000 టీఎంసీల నీరు వృధాగా పోతుండటంతో, రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అత్యవసరమని కేబినెట్ అభిప్రాయపడింది. గ్రామీణాభివృద్ధి కోసం అధికారులు నేరుగా గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

వివరాలు 

మత స్వేచ్ఛ,వక్ఫ్ బిల్లుపై టీడీపీ విధానం 

ప్రభుత్వ లక్ష్యం అన్ని మత విశ్వాసాలను గౌరవించడం అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లులో మార్పుల అవసరంపై ఇప్పటికే టీడీపీ తన సూచనలు అందించిందని ఆయన గుర్తుచేశారు. ముఖ్యాంశాలు: బార్ లైసెన్స్ ఫీజు రూ. 25 లక్షలకు తగ్గింపు ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు - 2025 ఆమోదం పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ అమలుకు "జలహారతి కార్పొరేషన్" ఏర్పాటు రూ. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు గ్రామీణాభివృద్ధికి అధికారుల ప్రత్యక్ష పాల్గొనలపై సీఎం ఆదేశం టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి అన్ని మత విశ్వాసాలకు గౌరవం - వక్ఫ్ బిల్లుపై టీడీపీ సూచనలు