NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / VRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    VRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
    సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం..

    VRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    10:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే.

    అప్పట్లో సీఎం కేసీఆర్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి ఎక్కువగా వీఆర్వో వ్యవస్థ ద్వారా జరుగుతున్నదని భావించి, వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు.

    వీఆర్వోలుగా పనిచేసిన అధికారులను వివిధ ఇతర డిపార్ట్‌మెంట్లలో సర్దుబాటు చేశారు.

    అప్పట్లో ఈ నిర్ణయానికి ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

    వివరాలు 

    పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు

    ఇప్పుడు, తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలనే నిర్ణయాన్ని రేవంత్ ప్రభుత్వం తీసుకుంది.

    వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

    సంక్రాంతి సమయం లోపు ఈ వ్యవస్థను తిరిగి తీసుకురాబోతున్నామని చెప్పారు.

    పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి నియమిస్తారని సమాచారం.

    రాష్ట్రంలో ప్రస్తుతం 3,000 మంది వీఆర్వోలు ఉన్నారు, ఇక మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలిపారు.

    10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమిస్తారని కూడా తెలిసింది.

    వివరాలు 

    శాసనసభ సమావేశాల్లోనే ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం

    మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, ప్రభుత్వం అమలు చేయబోయే ఆర్వోఆర్ చట్టంపై సూచనలు చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.

    ఈ శాసనసభ సమావేశాల్లోనే ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం ఇవ్వాలని చెప్పారు.

    గురువారం సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడుతూ, ధర్నాచౌక్‌ను పునరుద్ధరించామని తెలిపారు.

    నిరసన తెలియజేయాలనుకునే వారిని అడ్డుకోబోమని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా వసతి గృహాలకు పెండింగ్‌లో ఉన్న బకాయిల సొమ్ములను విడుదల చేస్తామని చెప్పారు.

    ఇంకా, ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తామని, డిసెంబర్ 31 లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.

    వివరాలు 

    ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు

    పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

    ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చామని, సర్వే అధికారులు పైరవీలు చేసే అవకాశాన్ని అడ్డుకునే అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు.

    ఇప్పటివరకు 2.32 లక్షల దరఖాస్తులను ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.

    అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయాలని, ఐటీడీఏ పరిధిలో ఇళ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్
    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్

    తెలంగాణ

    Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం
    custard apple: బాలానగర్‌లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు.. ఉద్యాన వర్సిటీ కసరత్తు  భారతదేశం
    Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి
    TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025