Tummala: బ్రెయిన్ స్ట్రోక్‌తో అల్లుడు… దుబాయ్‌లో మంత్రి తుమ్మల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. తన అల్లుడు కల్యాణ్ శేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గత నెల 23వ తేదీ నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి గత నెల 22న దుబాయ్‌కు వెళ్లిన కల్యాణ్ శేఖర్‌కు అదే రోజు సాయంత్రం అనూహ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఆయనకు అస్వస్థత కలగడంతో అక్కడి అధికారులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
భారత్‌కు విమాన సర్వీసులు ఈ నెల 6వ తేదీ వరకు రద్దు
సోమవారం దుబాయ్ ఆసుపత్రి వైద్యులు మంత్రి తుమ్మలతో మాట్లాడి, కల్యాణ్‌కు శస్త్రచికిత్స అవసరం లేదని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లాలని మంత్రికి సూచించారు. ఇక భారత్‌కు విమాన సర్వీసులు ఈ నెల 6వ తేదీ వరకు రద్దు చేసిన నేపథ్యంలో, అప్పటివరకు హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం 'ప్రముఖ మీడియా'కు ఫోన్‌లో తెలిపారు.