Page Loader
Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత ఘన విజయం సాధించింది. 2025 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఆమె తన పేరున నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 107 దేశాలను ప్రాతినిధ్యం వహించిన అందాల భామలతో జరిగిన పోటీలో ఓపల్ సుచాత విజేతగా నిలవడం విశేషం. మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి థాయ్‌లాండ్ మహిళగా ఆమె చరిత్రలో నిలిచింది. సుచాత 2003, సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరంలో జన్మించింది. తన ప్రాథమిక, మాధ్యమిక విద్యను కజోన్‌కిట్సుకా స్కూల్లో పూర్తి చేసింది.

Details

గతంలో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ కిరీటం కైవసం

ప్రస్తుతం ఆమె పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేస్తోంది. 2021 సంవత్సరం నుంచి ఆమె అందాల పోటీల్లో పాల్గొంటోంది. ఇప్పటికే మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2024 కిరీటాన్ని గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది.