Loading...
Mithun Chakraborty: బెంగాల్ సాంస్కృతిక సలహాదారుగా మిథున్ చక్రవర్తి.. సీఎం కీలక ప్రకటన
బెంగాల్ సాంస్కృతిక సలహాదారుగా మిథున్ చక్రవర్తి.. సీఎం కీలక ప్రకటన

Mithun Chakraborty: బెంగాల్ సాంస్కృతిక సలహాదారుగా మిథున్ చక్రవర్తి.. సీఎం కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని సాంస్కృతిక సలహాదారుగా (కల్చరల్ అడ్వైజర్) నియమించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్‌లో 'ఉత్తమ్ కుమార్ ఫిలిం సెంటర్' నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.25 కోట్లతో ఫిలిం సెంటర్ 'ఉత్తమ్ కుమార్ ఫిలిం సెంటర్'ను సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ ఇప్పటికే మంజూరు చేసిందని చెప్పారు. ఈ ఫిలిం సెంటర్ డిజైన్‌ను బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన నిపుణులే రూపొందిస్తారని, ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.

వివరాలు 

మూడు విభాగాలతో ఫిలిం సెంటర్

"సినీ రంగంతో అనుబంధం ఉన్నవారికే ఆయా పనుల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సిందల్లా అవసరమైన సహకారం అందించడమే. ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదు" అని సువేందు అధికారి పేర్కొన్నారు.

కోల్‌కతాలోని ప్రముఖ నందన్ కల్చరల్ సెంటర్ తరహాలో కొత్త ఫిలిం సెంటర్‌ను తీర్చిదిద్దనున్నారు.

ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉండనున్నాయి. మొదటి విభాగంలో 750 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో రెండు సినిమా హాళ్లు, ఒక ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు చేస్తారు.

వీటితోపాటు ఫుడ్ కోర్ట్, పార్కింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

రెండో విభాగంలో 1,000 సీట్ల సామర్థ్యం కలిగిన ఆడిటోరియంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఓపెన్-ఎయిర్ థియేటర్ నిర్మించనున్నారు.

వివరాలు 

వర్షాకాలం తర్వాత నిర్మాణ పనులు

మూడో విభాగంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి రంగాలకు అవసరమైన ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పిస్తారు.

ఇందుకోసం అత్యాధునిక ల్యాబొరేటరీలు, స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు.

ఫిలిం సెంటర్ కోసం ఇప్పటికే స్థల ఎంపిక, సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తయినట్లు సీఎం తెలిపారు.

ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

వర్షాకాలం ముగిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

సినీ ప్రముఖులకు సన్మానం

సెప్టెంబర్ 6 వరకు బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను సన్మానించనున్నట్లు సీఎం తెలిపారు.

ఈ సన్మానాలకు అర్హులైన వారిని ఎంపిక చేసే విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.

సన్మాన గ్రహీతలను ఎంపిక చేసే బాధ్యతను సినీ పరిశ్రమకు చెందిన కమిటీకే అప్పగించినట్లు చెప్పారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 'టాలీవుడ్' అనే పేరును తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బెంగాలీ చిత్ర పరిశ్రమకు కూడా ఉపయోగిస్తారు.

బెంగాలీ చిత్ర పరిశ్రమ ప్రధానంగా కోల్‌కతాలోని టాలిగంజ్ ప్రాంతం చుట్టూ అభివృద్ధి చెందడంతో దానికి 'టాలీవుడ్' అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.

ADVERTISEMENT