Loading...
MK Stalin: కొళత్తూర్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేసిన స్టాలిన్.. కోర్టును ఆశ్రయించిన డీఎంకే అధినేత
కోర్టును ఆశ్రయించిన డీఎంకే అధినేత

MK Stalin: కొళత్తూర్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేసిన స్టాలిన్.. కోర్టును ఆశ్రయించిన డీఎంకే అధినేత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొళత్తూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు ఎదురైన ఓటమిని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు సాధించిన విజయాన్ని సవాల్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కొళత్తూర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పిటిషన్‌లో ఆరోపించారు. ఓటింగ్‌ యంత్రాల (EVM), వీవీపాట్‌ (VVPAT) ప్రక్రియల్లో పలు లోపాలు తలెత్తాయని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కొళత్తూర్‌ నియోజకవర్గంలో మరోసారి ఓట్లను లెక్కించాలని న్యాయస్థానాన్ని కోరారు. టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు విజయాన్ని రద్దు చేసి, రీకౌంటింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

టీవీకే అభ్యర్థి చేతిలో ఆయన 9 వేల ఓట్ల తేడాతో ఓటమి

ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూర్‌ నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్‌ పోటీ చేశారు.

అయితే టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో ఆయన 9 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

దీంతో కొళత్తూర్‌ నుంచి వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన స్టాలిన్‌ ఈసారి విజయాన్ని అందుకోలేకపోయారు.

1996 తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి.

దీంతో కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై ఆయన హైకోర్టును ఆశ్రయించడం తమిళనాడు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT