తదుపరి వార్తా కథనం

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కారుకు ప్రమాదం.. ముగ్గరికి గాయాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 31, 2023
02:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని ఓ కార్యక్రమానికి వెళ్తుతుంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కారును కౌన్సిలర్ల కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కౌన్సిలర్ రంగన్న, గంగమోహన్ ఛక్రుకు గాయాలయ్యాయి.
Details
వైస్ చైర్మన్ కు తీవ్ర గాయాలు
కౌన్సిలర్ రంగన్నకు చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైస్ చైర్మన్ మున్న బాయ్ కాలు విరిగింది. దీంతో అతన్ని నిజామాబాద్ ఆస్ప్రతిలో చేర్చారు.
ఈ ప్రమాదంలో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.