Kolikapudi: ఎమ్మెల్యే కొలికపూడి కొత్త వివాదం.. వాట్సాప్ స్టేటస్‌లతో మరో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి కొత్త వివాదాన్ని రేకెత్తించారు. విస్సన్నపేట మండల తరఫున టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని ఆయన వాట్సాప్‌లో వివాదాస్పదమైన స్టేటస్‌లు పోస్టు చేశారు. 'నువ్వు ఏది అధ్యక్షుడివి? జూదం క్లబ్‌కా? జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నిజంగా రాయల్' అని కొలికపూడి తన స్టేటస్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టులపై వివరణ కోరగా, రాయల సుబ్బారావు చాలాకాలంగా జూదం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు.
Details
గతంలో కూడా విమర్శలు
ఇదే కాకుండా, గతంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై కూడా ఆయన బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొలికపూడి ప్రవర్తన పార్టీకి నష్టం చేకూరుస్తోందని భావించిన తెదేపా అధిష్ఠానం అప్పటికప్పుడు స్పందించి ఆయన్ను పిలిపించి వివరణ తీసుకుంది. అయినప్పటికీ, కొలికపూడి వైఖరిలో మార్పు కనిపించడం లేదనే విమర్శలు కొనసాగుతున్నాయి.