Page Loader
దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 
దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట

దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కి వాయిదా పడింది. తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. ఆ తర్వాత ఈ కేసును విచారిస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న కవిత పిటిషన్‌పై ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి వరకు కవితను విచారణకు పిలవబోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసిన కోర్టు