LOADING...
Telangana: వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడీ సేవలు
వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడీ సేవలు

Telangana: వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడీ సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలను మరింత సులభంగా అందించేందుకు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఉపాధి కోసం తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే కార్మికుల పిల్లలు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలకు దూరం కాకుండా ఉండేలా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్కతో కలిసి మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

వివరాలు 

ప్రాజెక్టు విజయవంతమైతే.. మరిన్ని మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు 

తొలి దశలో ఈ వాహనం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో సేవలు అందించనుంది. అక్కడి వలస కార్మికుల చిన్నారులకు అంగన్వాడీ సేవలు, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ, ప్రాథమిక విద్యా కార్యక్రమాలు ఈ వాహనం ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మరిన్ని మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలను విస్తరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement