Page Loader
మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు
మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు

మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు

వ్రాసిన వారు Stalin
May 12, 2023
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత తుపాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యుక్‌ప్యూ మధ్య మే 14 మధ్యాహ్న సమయంలో సిట్వేకి సమీపంలో 'మోచా' అతి తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఐఎండీ చెప్పింది. ఆ సమయంలో గంటకు 150-175 కిలీమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

తుపాను

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం 

తుపాను హెచ్చరికల దృష్ట్యా, పశ్చిమ బెంగాల్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఎనిమిది బృందాలను మోహరించినట్లు 2వ బెటాలియన్ కమాండెంట్ గుర్మీందర్ సింగ్ తెలిపారు. 'మోచా' మే 12న తీవ్ర తుపానుగా, మే 14న అత్యంత తీవ్రమైన తుపానుగా మారుతుందని ఐఎండీ అంచనాల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యెమెన్‌లోని ఒక చిన్న పట్టణం పేరు 'మోచా'. ఈ తుపాను మోచా అని పేరు పెట్టారు.