PM Modi : హిందువులకు భద్రత కల్పించండి.. మహ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన 'ఎక్స్' ఖాతాలో మహమ్మద్ యూనస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బంగ్లాదేశ్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ శుభాకాంక్షలు.. త్వరలోనే బంగ్లా సాధారణ పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. హిందువులతో పాటు బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్ లో దౌత్యపరంగా కలిసి ముందుకెళ్లడానికి, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
శాంతి భద్రతలను పరిరక్షించడానికి సిద్ధం
శాంతి భద్రతలను పరిరక్షించడానికి భారత్ ఇప్పటికీ సిద్ధంగా ఉందని తన 'ఎక్స్' ఖాతాలో మోదీ రాసుకొచ్చారు. రాష్ట్రపతి భవన్‌లోని బంగ్లా భబన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్‌చే యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. వందలాది మరణాలకు దారితీసిన హింస తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించడం కోసం కృషి చేస్తామన్నారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆగస్టు 8, 2024 గురువారం రాత్రి ప్రమాణస్వీకారం చేసింది.