Loading...
Modi: థింసా నృత్యానికి మోదీ ఫిదా.. మంత్రి సంధ్యారాణికి ప్రత్యేక అభినందనలు
థింసా నృత్యానికి మోదీ ఫిదా.. మంత్రి సంధ్యారాణికి ప్రత్యేక అభినందనలు

Modi: థింసా నృత్యానికి మోదీ ఫిదా.. మంత్రి సంధ్యారాణికి ప్రత్యేక అభినందనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థినులు ఒకే రంగు చీరలు ధరించి, లయబద్ధంగా థింసా నృత్యం చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ టెర్మినల్‌ భవనం నుంచి సభా వేదిక వరకు ఓపెన్‌టాప్‌ జీపులో ప్రయాణించిన ప్రధాని మోదీ, మార్గమంతా కొనసాగిన ఈ భారీ థింసా నృత్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

వివరాలు

వేలాది మంది గిరిజన మహిళలతో థింసా నృత్యం

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని ప్రధానికి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా వేలాది మంది గిరిజన మహిళలు, విద్యార్థినులతో రికార్డు స్థాయిలో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించిన విషయాన్ని ప్రధానికి వివరించారు.

పక్కా ప్రణాళికతో వేలాది మందిని ఒకే లయలో నృత్యం చేయించి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి సంధ్యారాణిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

ADVERTISEMENT