LOADING...
Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ
ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ

Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్‌ పార్టీ పరిషత్‌ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు మోదీ ప్రభుత్వం దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఇటీవల ఏకపక్షంగా చట్టంలో మార్పులు చేసినందుతో పాటు, దేశంలోని కోట్లాది రైతులు, కార్మికులు, భూమిలేని వ్యక్తుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నట్లున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ అంశంపై సోనియా గాంధీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సోనియా గాంధీ 20 ఏళ్లు క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంట్ ఏకాభిప్రాయంతో ఆమోదించగా, అది విప్లవాత్మక అడుగు అని గుర్తు చేశారు.

Details

ఏకపక్షంగా చట్టాన్ని మార్చడం దారుణం

ఈ పథకం అత్యంత పేద, అణగారిన వారి జీవితాలకు ఉపాధి మార్గాన్ని అందించింది. వలసలను ఆపుతూ, ఉపాధికి హామీ ఇచ్చిందని ఆమె వివరించారు. మహాత్మా గాంధీ కలల గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తీసుకొచ్చిన పథకాన్ని మోదీ ప్రభుత్వం అణచివేశామని ఆమె విమర్శించారు. 11 ఏళ్లుగా గ్రామీణ పేదల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా పథకం స్వరూపాన్నే మార్చివేశారని సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా, విపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా చట్టాన్ని మార్చడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు లక్షలాది కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సోనియా గాంధీ పేర్కొన్నారు.

Advertisement