LOADING...
PM Narendra Modi: ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

PM Narendra Modi: ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంత ఋతువు ఆరంభం, కొత్త ప్రారంభాల స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా ఆయన ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. తెలుగు భాషలోనే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సందేశంలో ఉగాది పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. పవిత్రమైన ఉగాది పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వసంత ఋతువు మన చుట్టూ ఆనందం, ఉల్లాసాన్ని నింపే అందమైన కాలం. ఈ కాలంలో వికసించే పూల సువాసనలు, లభించే పండ్ల సమృద్ధి కొత్త ఆశలు, అవకాశాలకు సంకేతాలని పేర్కొన్నారు.

వివరాలు

తీపి, చేదు అనుభవాలను సమానంగా స్వీకరించాలి

అలాగే రైతుల పాత్రను ప్రస్తావిస్తూ మన కష్టజీవులైన రైతన్నలు కొత్త వ్యవసాయ చక్రానికి ఆశాభావంతో సిద్ధమయ్యే సమయం ఇదేనని చెప్పారు. ఉగాది పచ్చడి ద్వారా జీవితంలోని తీపి, చేదు అనుభవాలను సమానంగా స్వీకరించాలని సూచించే సంప్రదాయం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. జీవితంలోని ప్రతి అనుభవాన్ని అంగీకరించే భావన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సవాళ్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించేలా ప్రేరేపిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం నింపాలని, వారు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని, శాంతి, సానుకూలత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement