
రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో జరిగిన కార్యక్రమంలో రూ. 5,500 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు.
దేశంలో మంచి జరగాలని కొందరు కోరుకోవడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతిదాన్ని ఓట్లతో కొలిచే వారు దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించలేకపోతున్నారని అన్నారు.
అయితే ప్రాధాని మోదీ ఎవరి పేరు చెప్పకుండా ఇలా విమర్శలు చేయడం గమనార్హం.
వారు వివాదాలు సృష్టించడం మాత్రమే ఇష్టపడతారని మోదీ స్పష్టం చేశారు.
సుస్థిర, వేగవంతమైన అభివృద్ధి కోసం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన అవసరమని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు.
మోదీ
ఈ శంకుస్థాపనలు మోదీ వ్యూహాత్మకంలో భాగమేనా?
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని వ్యూహాత్మకంగానే భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపపలను చేసినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి పనులను ప్రధాని మోదీ శంకు స్థాపన చేసిన సమయంలో ఆయన పక్కన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు.
రాజ్‌సమంద్, ఉదయ్‌పూర్‌లలో రెండు-లేన్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి, ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయడానికి, రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
గేజ్ కన్వర్షన్ ప్రాజెక్ట్, రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా నుంచి నాథ్‌ద్వారా పట్టణం వరకు కొత్త లైన్ ఏర్పాటుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్-48లో ఆరు లేన్‌లు, ఎన్‌హెచ్-25లో 4లేన్‌ల నిర్మాణం సహా మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశోక్ గెహ్లోట్‌తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ
Prime Minister Narendra Modi dedicates and lays the foundation stone of infrastructure projects worth over Rs 5,500 crores in Nathdwara, Rajasthan. pic.twitter.com/7T7EfZ4p1n
— ANI (@ANI) May 10, 2023