Loading...
Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్

Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో తమ ప్రమేయం లేదని చెప్పారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, 2028లో ఎన్నికలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

Details

కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌ను క‌లిసిన సీఎం

మహిళా రిజర్వేషన్లు ముందుగానే అమల్లోకి వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇక దిల్లీ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కూడా రాహుల్, ప్రియాంకలకు ఆయన పరిచయం చేశారు.

ADVERTISEMENT