Loading...
Sonia Gandhi Biopic: సోనియా గాంధీగా ప్రపంచ అందగత్తె మోనికా బెలూచి.. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?
సోనియా గాంధీగా ప్రపంచ అందగత్తె మోనికా బెలూచి.. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?

Sonia Gandhi Biopic: సోనియా గాంధీగా ప్రపంచ అందగత్తె మోనికా బెలూచి.. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ఇటీవల విడుదల కావడంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర అంశం చర్చనీయాంశంగా మారింది. 2006లోనే సోనియా గాంధీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అందులో సోనియా పాత్రలో నటించేందుకు ప్రపంచ ప్రఖ్యాత నటి మోనికా బెలూచిని ఎంపిక చేశారు. అయితే ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? అసలు ఏం జరిగింది?

వివరాలు

సోనియాగా మోనికా బెలూచి..

ఈ నెల 10న సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇటాలియన్‌ నటి మోనికా బెలూచి 'సోనియా' పాత్రకు ఎంపికయ్యారు.

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలి రాజకీయ ప్రస్థానం ఆధారంగా జర్నలిస్టు రషీద్‌ కిద్వాయ్‌ రాసిన 'సోనియా: ఏ బయోగ్రఫీ' పుస్తకం 2003లో విడుదలైంది.

అమెరికాలో స్థిరపడిన భారతీయ దర్శకుడు జగన్మోహన్‌ ముంద్రా, నిర్మాత సునంద మురళీ మనోహర్‌ ఈ పుస్తకాన్ని సినిమాగా రూపొందించాలని భావించారు.

ఈ చిత్రానికి 'సోనియా' అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌ పాత్రలో నటించేందుకు మోనికా బెలూచి సంతకం చేసినట్లు అప్పట్లో అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

వివరాలు

కాంగ్రెస్‌ లీగల్‌ నోటీసులతో సినిమా నిలిపివేత

అయితే సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి 60రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలో వాస్తవాలను వక్రీకరించే అవకాశం ఉందంటూ నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపించింది.

దీనిపై అప్పట్లో దర్శకుడు జగన్మోహన్‌ ముంద్రా స్పందించారు. ''నా దగ్గర ఉన్న స్క్రిప్ట్‌లో వివాదాస్పద అంశాలేవీ లేవు. ఒక వ్యక్తిగా సోనియా గాంధీ పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది.

ఇటలీలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి.. విభిన్న మతాలు, జాతులకు నిలయమైన దేశంలో అగ్ర రాజకీయ నాయకురాలిగా ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండరు.

అందుకే ఈ అంశాల ఆధారంగా సినిమా తీయాలనే ఆసక్తి కలిగిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత కూడా సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు పలుమార్లు ఆసక్తి చూపించారు.

ADVERTISEMENT

వివరాలు

స్క్రిప్ట్‌ నచ్చక మోనికా బెలూచి వెనక్కి

అయితే, 2011లో ఆయన మరణించడంతో 'సోనియా' సినిమా ప్రయత్నాలకు తెరపడింది.

ఈ సినిమా గురించి మోనికా బెలూచి కూడా ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ''ఓ భారతీయ చిత్రంలో సోనియా గాంధీ పాత్ర పోషించమని నన్ను సంప్రదించిన మాట వాస్తవమే.

అయితే, నాకు స్క్రిప్ట్‌ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్టులో ముందుకు వెళ్లలేకపోయానని ఆమె తెలిపారు. ఈ పాత్ర కోసం బాలీవుడ్‌ నటీమణులు ఐశ్వర్యారాయ్‌, ప్రీతి జింటా పేర్లను కూడా అప్పట్లో పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు

మళ్లీ తెరపైకి 'సోనియా' సినిమా ప్రతిపాదన

ప్రస్తుతం సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్‌' బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిన నేపథ్యంలో మరోసారి ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసే అంశం చర్చలోకి వచ్చింది.

ఈ పుస్తకం ఆధారంగా సినిమా రూపొందిస్తానని తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించారు.

పార్టీ నాయకులు డబ్బులు సిద్ధం చేసుకోవాలి. ప్రజలకు సోనియా జీవిత చరిత్రను సినిమా ద్వారా చూపించాలి. ఆమెది విజయవంతమైన రాజకీయ జీవితం.

సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చేతుల మీదుగా షూటింగ్‌ ప్రారంభిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

సోనియా పుట్టినరోజైన డిసెంబర్‌ 9న సినిమా పనులు ప్రారంభించి, 2028 డిసెంబర్‌ 9న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు

వివరాలు

'కూలీ'లో మోనికా పాట వెనుక అసలు కారణం

మరోవైపు, ప్రముఖ నటుడు రజనీకాంత్‌ నటించిన 'కూలీ' చిత్రంలో పూజా హెగ్డే కనిపించిన ప్రత్యేక గీతం 'మోనికా' ఇంటర్నెట్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

మోనికా బెలూచి మీద ఉన్న అభిమానంతోనే ఆ పాటను రూపొందించినట్లు దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ అప్పట్లో వెల్లడించారు.

మోనికా బెలూచి ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్‌ నటి, మోడల్‌. ఇటాలియన్‌, ఫ్రెంచ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పలు మ్యాగజైన్లు ఆమెను 'ప్రపంచ అందగత్తె'గా అభివర్ణించాయి.

ADVERTISEMENT