Loading...
Parliament: ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా
ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా

Parliament: ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్‌సభ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ మధ్యలోకి రావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ తలెత్తడంతో ఆ సభను కూడా మధ్యాహ్నం వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి. దీంతో రెండు సభల్లోనూ సాధారణ కార్యకలాపాలు కొనసాగడం సాధ్యపడలేదు.

వివరాలు 

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు

పార్లమెంట్ వెలుపల కూడా నీట్ అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వేలాది మంది నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఎంపీలు కూడా పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు.

సోమవారం ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న గరిష్ట న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే ఆర్డినెన్స్‌కు బదులుగా ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చింది.

వివరాలు 

ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు

ఇదిలా ఉండగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పాటు, ప్రాణాలు కోల్పోయిన 20 మందికిపైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోరుతూ ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించింది.

పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు కొనసాగడంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

మరోవైపు, నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ అంశంపై పార్లమెంట్ లోపల, వెలుపల రాజకీయ వేడి కొనసాగుతోంది.

ADVERTISEMENT