జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
వ్రాసిన వారు
Stalin
Jul 01, 2023
12:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది. జులై 20 నుంచి వర్షాకాల సమావేశాలు-2023ను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల్లో సభా వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి