Most polarised state: బందీలుగా ఎస్‌ఐఆర్ అధికారులు.. కేంద్ర బలగాల మోహరింపుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పోలింగ్‌కు సిద్ధమవుతున్నపశ్చిమ బెంగాల్'లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా పనిచేస్తున్న ఏడుగురు న్యాయ అధికారులను మాల్దా జిల్లాలో నిరసనకారులు దాదాపు తొమ్మిది గంటల పాటు బందీలుగా ఉంచారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ,వారి భద్రత కోసం కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. బెంగాల్‌ను "అత్యంత విభజనాత్మక రాష్ట్రం"గా పేర్కొంటూ, ఈ ఘటన ముందస్తుగా పన్నిన కుట్రగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. బుధవారం కలియాచక్-2 బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (BDO) వద్ద భారీగా నిరసనలు చెలరేగాయి. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
రెండు దశల్లో బెంగాల్‌లో ఎన్నికలు
మొదట న్యాయ అధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరినా, అనుమతి లభించలేదు. దీంతో సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో BDO కార్యాలయాన్ని చుట్టుముట్టి, ముగ్గురు మహిళలు సహా మొత్తం ఏడుగురు అధికారులను బందీలుగా ఉంచారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన వివాదంగా మారింది. ఈ ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాలో 63లక్షలకుపైగా పేర్లు తొలగించారు. మరో 60 లక్షల ఓటర్లను "పరిశీలనలో" ఉంచారు. వీటి పై నిర్ణయం తీసుకోవడంలో ఈ న్యాయ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బెంగాల్‌లో ఎన్నికలు ఏప్రిల్ 23,ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగనున్నాయి.
వివరాలు
తొమ్మిది గంటల తరువాత రంగంలోకి పోలీసులు
ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఇదే సమయంలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. దాదాపు తొమ్మిది గంటల తరువాత పోలీసులు రంగంలోకి దిగి న్యాయ అధికారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అధికారులు బయటకు తీసుకువస్తున్న సమయంలో నిరసనకారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో, వాహనాల అద్దాలు పగిలిపోవడం, పోలీసు వాహనాలను వెంటాడుతున్న నిరసనకారులు కనిపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఇవే..
West Bengal: Protesters in Malda's Mothabari blocked seven Election Observers (Judicial magistrates) including 3 women for many hours
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 2, 2026
Central forces rushed and along with police later rescued the observers and brought them to Malda city. pic.twitter.com/mkCWwQaD6t