LOADING...
Medak: గుండెపోటుతో  గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి 
Medak: గుండెపోటుతో గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి

Medak: గుండెపోటుతో  గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి 

వ్రాసిన వారు Stalin
Jan 06, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కుంచన్‌పల్లి గ్రామంలో గంట వ్యవధిలోనే తల్లీకుమారుడు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. శనివారం ఉదయం నరసింహగౌడ్‌ (36) గుండెపోటుతో చనిపోగా.. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లి లక్ష్మి (57) కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. నర్సింహగౌడ్‌ కారు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి కుప్పకూలిపోయింది. దీంతో ఆమె కూడా చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుంచన్‌పల్లిలో విషాద ఛాయలు