
Pune: పూనే పోర్ష్ కారు ప్రమాదం.. యువకుని తల్లి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
పూనే పోర్ష్ కారు ప్రమాదంలో మరో అరెస్టు జరిగింది.ఈ సారి ఆ టీనేజీ యువకుని తల్లి కావడం గమనార్హం.
ఆమెను అరెస్టు చేయడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన తర్వాత తన కుమారుడికి బదులుగా తన రక్తపు శాంపిళ్లను శివానీ అగర్వాల్ ఇచ్చారు.
దీనితో ఫోర్స్ నిక్ ల్యాబ్( FSL) పరీక్షల్లో ఫలితం మామూలుగా వచ్చింది. తొలుత యువకుని శాంపిళ్లను చెత్త బుట్టలో పడేశారు.
దీంతో అనుమానం వచ్చిన పూనే పోలీసులు వేరే ల్యాబ్ లో పరీక్షకు ఇచ్చారు. టీనేజీ యువకుని శాంపిళ్లలో మద్యం తాలూకు ఆనవాళ్లు కనిపించాయి.
Details
శివానీఅరెస్ట్.. శాంపిళ్లు తారుమారు
శాంపిళ్లు తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను అరెస్టు జరిగిన నాటి నుంచి శివానీ అదృశ్యమయ్యారు. చివరికి ఆమెను పూనే పోలీసులు ముంబైలో నిన్న(శుక్రవారం)అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంగతిని పోలీసు కమిషనర్ అమిత్ కుమార్ ప్రకటించారు. తెలిపారు. ఆమె అరెస్ట్ తో శాంపిళ్లు తారుమారు చేశారని ధృవీకరణ అయిందన్నారు.
కాగా ఈ కేసులో యువకుని తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్ ఇప్పటికే పోలీసులు కస్టడీలో వున్నారు.
ప్రమాదానికి పరోక్ష కారణమయ్యారని విశాల్ అగర్వాల్ అరెస్ట్ కాగా డ్రైవర్ ను బెదిరించిన కేసులో తాత సురేంద్ర అగర్వాల్ జైలులో వున్న సంగతి తెలిసిందే.