తదుపరి వార్తా కథనం

Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 07, 2024
05:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
నగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో ప్రయాణ మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంతో నిండిపోయాయి.
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు., వర్షాల నేపథ్యంలో మరింత యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాల్లో వరద నీరు మళ్లీ చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇలాగైతే, ఆ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను చీకటిపడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు.
అవసరమైన ఆహారం, ఇతర సౌకర్యాలను అందించాలన్నారు.