Page Loader
Daggubati Purandeswari: కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పురంధేశ్వరి.. లోక్‌సభ స్పీకర్‌ ఉత్తర్వులు
మన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పురంధేశ్వరి

Daggubati Purandeswari: కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పురంధేశ్వరి.. లోక్‌సభ స్పీకర్‌ ఉత్తర్వులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఆమెను కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు.కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా ఆమె ఎంపికయ్యారు. అలాగే, కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నియామకం 2026 చివరి వరకు అమల్లో ఉంటుంది. అంటే 2024 నుండి 2026 వరకు ఆమె ఈ చైర్‌పర్సన్ పదవిలో కొనసాగనున్నారు. మహిళా పార్లమెంటేరియన్లకు,స్టీరింగ్ కమిటీకి ఆమె చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

వివరాలు 

రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి విజయం

ఇక, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ తరపున రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. దాంతో, ఆమెకు మళ్లీ కేంద్ర మంత్రిత్వ బాధ్యతలు వస్తాయా? అనే చర్చలు జరిగాయి. అయితే, ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కీలకమైన పదవితో ఆమెను గౌరవించింది. ప్రస్తుతానికి, ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్నారు.