UGC on M.Phil: ఎంఫిల్ అడ్మిషన్ తీసుకోకండి.. దానికి గుర్తింపు లేదు: యూజీసీ హెచ్చరిక
ఎంఫిల్ (M.Phil)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిలిపివేసింది. ఇకపై ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవద్దని యూజీసీ హెచ్చరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం విద్యార్థులు యూజీసీ అధికార వెబ్‌సైట్ ugc.gov.in ను సందర్శించాలని సూచించింది. ఇప్పటికీ కొన్ని యూనివర్సిటీలు ఎంఫీల్ కోసం కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయని యూజీసీ పేర్కొంది. గతేడాది నుంచే ఎంపిల్ డిగ్రీని నిలిపివేసినట్లు కమిషన్ తెలిపింది. కొన్ని విశ్వవిద్యాలయాలు M.Phil కోసం కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ వచ్చిందని కమిషన్ పేర్కొంది. యూజీసీ రెగ్యులేషన్ నెం. 14 నిబంధనలు, 2022 ప్రకారం ఉన్నత విద్యాసంస్థలు ఎంపిల్ డిగ్రీని అందించకూడదని యూజీసీ స్పష్టం చేసింది.