Page Loader
Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు 

Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు 

వ్రాసిన వారు Stalin
Oct 28, 2023
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీకి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి పంపిన ఈ మెయిల్‌లో గుర్తు తెలియని వ్యక్తి రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని అందులో హెచ్చరించాడు. తమ వద్ద భారతదేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నట్లు షూటర్లు మెయిల్‌లో దుండగులు పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. ముకేష్ అంబానీకి చంపేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తి ముకేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్ చేసి, అరెస్టయ్యాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముకేష్ అంబానీకి ఈ మెయిల్ బెదిరింపులు