Page Loader
బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ 
బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్

బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరేబియా సముద్రంలో బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ముంబైలోని విమాన కార్యకలాపాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి. బిపోర్‌జాయ్ తుపాను అతి తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారీ వర్షం, ఈదురు గాలులు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని ఆలస్యమయ్యాయి. వందలాది మంది ప్రయాణికులు తమ విమానాల కోసం గంటల తరబడి నిరీక్షించడంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కూడా కష్టమైపోయింది. దీంతో కొన్ని విమానాలను ల్యాండింగ్‌ కోసం ఇతర ఎయిర్ పోర్టులకు తరలించారు.

ముంబై

రన్‌వే తాత్కాలికంగా మూసివేత

ప్రతికూల వాతావరణం వల్ల రన్‌వే తాత్కాలికంగా మూసివేసినట్లు, ఫలితంగా ముంబై నుంచి నడిచే కొన్ని విమానాలు ఆలస్యం అవుతాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై విమానాశ్రయంలో రన్‌వే 09/27 తాత్కాలికంగా మూసివేసినట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అంతరాయాలను తగ్గించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. పరిస్థితులను నియంత్రించలేనందు వల్లే విమాన వేళల్లో మార్పులు చేయాల్సి వస్తోందని అని ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రయాణికుడికి ప్రతిస్పందిస్తూ ట్వీట్ చేసింది. కోస్తా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఉరుములతో కూడిన హెచ్చరిక జారీ చేసింది. బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్, పాకిస్థాన్ తీరాలను తాకనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎయిర్ ఇండియా ట్వీట్