Murder at mumabi chicken shop: చికెన్ షాప్ వద్ద బిల్లు చెల్లింపు విషయంలో ఘర్షణ...దాడి చేయడంతో ఒకరి మృతి
ముంబైలో 200 రూపాయల చికెన్ బిల్లు కోసం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికాగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఓ చికెన్ షాప్ లో బిల్లు చెల్లించే విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్యూన్గా పనిచేసే అక్షయ్ నర్వేకర్, మరోవ్యక్తి ఆకాష్ సాబ్లే ఆదివారం ఉదయం సమీపంలోని చికెన్ షాప్ కి వెళ్ళాడు. బిల్లు చెల్లించే విషయంలో ఈ ఘర్షణ జరగడంతో అక్కడ ఉన్న ఇమ్రాన్ ఖాన్ అతడి సోదరుడు సలీం ఖాన్ మరో ముగ్గురు వ్యక్తులు అక్షయ్ నర్వేకర్, ఆకాష్ సాబ్లే లతో గొడవ దిగారు. దీంతో అక్కడి నుంచి అక్షయ నెర్వేకర్ ఆకాశ్ సాబ్లే లు వెళ్లిపోయారు.
అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు
తిరిగి రాత్రి మళ్ళీ చికెన్ షాప్ దగ్గరికి వీరిద్దరూ వెళ్లారు. దీంతో ముందుగా అనుకున్న ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అతడి సోదరుడు సలీం ఖాన్ మరో ముగ్గురు కలిసి రాడ్లు పదునైన ఆయుధాలతో వీరిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నర్వేకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాశ సాబ్లే తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికు ల నుంచి సమాచారం అందుకున్న పోలీస్ లు వెంటనే ఘటనస్థలికి చేరుకుని సదరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచగా మే 8 వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.