Loading...
MUMBAI: ట్రాన్స్‌జెండర్‌ వేషంలో వచ్చి.. పూజల పేరుతో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం
ట్రాన్స్‌జెండర్‌ వేషంలో వచ్చి.. పూజల పేరుతో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం

MUMBAI: ట్రాన్స్‌జెండర్‌ వేషంలో వచ్చి.. పూజల పేరుతో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్‌జెండర్‌నని నమ్మించి, ఇంటికి పట్టిన చెడు దిష్టిని తొలగించేందుకు పూజలు చేస్తానంటూ ఓ యువకుడు 25 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ను మోసం చేశాడు. పూజల పేరుతో ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ముంబైలోని ఓ ప్రముఖ హౌసింగ్ సొసైటీలో బుధవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌ వేషధారణలో వచ్చిన వ్యక్తి ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ తలుపు తట్టాడు. ఇంటికి చెడు దిష్టి ఉందని, దానిని తొలగించేందుకు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని 25 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ను నమ్మించాడు.

వివరాలు 

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

అదే సమయంలో ఆమె భర్త అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దీంతో భర్త ఆరోగ్యం, ఇంటి పరిస్థితిపై ఆందోళనలో ఉన్న ఆమె.. నిందితుడు చెప్పిన మాటలను నమ్మింది.

అతడు పూజలు చేస్తాననడంతో అందుకు అంగీకరించింది. అనంతరం నిందితుడు ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు.

పూజలు చేస్తానని చెప్పి ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాలు 

సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడి అరెస్టు

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హౌసింగ్ సొసైటీలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు.

కల్వా ప్రాంతంలోని ఓ మురికివాడకు చెందిన అనిల్ షిండే (28)ను పోలీసులు అరెస్టు చేశారు.

పూజలు చేస్తానంటూ బాధితురాలి నుంచి నిందితుడు రూ.200 తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అంతకుముందు కూడా అతడు పలువురి ఇళ్ల తలుపులు కొట్టి,ఇంటికి దిష్టి ఉందని చెబుతూ పూజలు చేస్తానని నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఘటన నేపథ్యంలో అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోకి అపరిచిత వ్యక్తులను అనుమతించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

గుర్తుతెలియని వ్యక్తులు పూజలు,దిష్టి తొలగింపు లేదా ఇతర కారణాలతో ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

ADVERTISEMENT