Page Loader
ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్
ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్

ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 24, 2023
07:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీకా వైరస్‌ దేశంలో మరోసారి కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జికా వైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబై చెంబూర్‌ సమీపంలోని ఎం-వెస్ట్‌ వార్డులో ఉంటున్న 79 ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్‌ సోకింది. జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో పాటు పలు లక్షణాలు బయటపడ్డాయి. ఏడిస్ దోమలతో జీకా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు జికాకు నిర్ధిష్టంగా ఎలాంటి చికిత్స లేదు.ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్ద బాధితుడు చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబైలో మొదటి కేసు